అస్హాబ్ అస్-సుఫ్ఫా : ప్రవక్త ముహమ్మద్ ﷺ గారి గొప్ప ప్రేమికులు
ఇస్లాం యొక్క చరిత్రలో ఎందురో గొప్ప సహాబాలు ఉన్నారు. అయితే వారందరిలో (అస్హాబ్ ఉస్-సుఫ్ఫా కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వీరు సంపద, సుఖాలు మరియు ఈ ప్రపంచపు ఆనందాల కంటే అల్లాహ్ సంతోషాన్ని మరియు ప్రవక్త ముహమ్మద్ ﷺ యొక్క సహవాసాన్ని మరియు ఇస్లామీయ జ్ఞానాన్ని ఎక్కువగా విలువైనవిగా భావించారు. అంతేగాకుండా పేదరికం, ఆకలి మరియు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ వారు తమ విశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. అల్లాహ్‌పై పూర్తి నమ్మకంతోమరియు ప్రవక్త ﷺ పట్ల ప్రేమతో తమ జీవితాన్ని గడిపారు.
అస్హాబ్ ఉస్-సుఫ్ఫా కేవలం పేద సహాబాలు మాత్రమే కాదు. వారు ఇస్లాం కోసం తమ జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తులు. వారు ఎక్కువ సమయం ఖుర్‌ఆన్ నేర్చుకోవడంలోమరియు ప్రవక్త ﷺ యొక్క బోధనలను వినడంలో, అల్లాహ్ ఆరాధనలో మరియు ముస్లిం సమాజానికి సేవ చేయడంలో గడిపేవారు. వారిలో చాలామంది తరువాత గొప్ప పండితులుగా, హదీస్ వక్తలుగా మరియు ఇస్లాం సేవకులుగా గుర్తింపు పొందారు.
ఈ వ్యాసంలో అస్హాబ్ ఉస్-సుఫ్ఫా ఎవరు, వారు ఎలా జీవించారు, ఇస్లాం కోసం ఎలాంటి త్యాగాలు చేశారు మరియు ప్రవక్త ముహమ్మద్ ﷺ వారిని ఎంతగా ప్రేమించేవారు మరియు వారి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలు ఏమిటో తెలుసుకుందాం.
ప్రవక్త ముహమ్మద్ ﷺ మదీనాకు హిజ్రత్ చేసిన తరువాత మొదట్లో ముస్లింలు జెరూసలేం వైపు తిరిగి నమాజ్ చేసేవారు. తరువాత అల్లాహ్ తమ యొక్క గ్రంధం లో ఇలా ఆదేశించాడు:
قَدْ نَرَىٰ تَقَلُّبَ وَجْهِكَ فِي السَّمَاءِ ۖ فَلَنُوَلِّيَنَّكَ قِبْلَةً تَرْضَاهَا ۚ فَوَلِّ وَجْهَكَ شَطْرَ الْمَسْجِدِ الْحَرَامِ ۚ وَحَيْثُ مَا كُنتُمْ فَوَلُّوا وُجُوهَكُمْ شَطْرَهُ ۗ
అర్థం: "(ఓ ప్రవక్తా!) నీ ముఖం పదే పదే ఆకాశం వైపునకు తిరగడాన్ని మేము చూస్తున్నాము. కాబట్టి నీవు ఇష్టపడే ఖిబ్లా వైపునకే మేము నిన్ను తిప్పుతున్నాము. ఇకపై నీ ముఖాన్ని మస్జిద్-అల్-హరామ్ (కాబా) వైపునకు తిప్పుకో. మీరెక్కడున్నా సరే (నమాజ్ సమయంలో) మీ ముఖాలను దాని వైపునకే తిప్పండి (ఖుర్‌ఆన్ 2:144)."
అయితే ఈ అల్లాహ్ యొక్క ఆదేశం విని ప్రజలు మక్కాలోని కాబా వైపు తిరిగి నమాజ్ చేయడం ప్రారంభించారు.
దీని తరువాత ప్రవక్త ﷺ మస్జిద్ వెనుక భాగంలో ఒక నీడ ఉండే స్థలాన్ని ఏర్పాటు చేయించారు. ఆ ప్రదేశాన్నే సుఫ్ఫా అని పిలిచేవారు. అక్కడ ఇల్లు లేని వారు, పేదవారు మరియు ప్రయాణికులు నివసించేవారు. అది కేవలం నివసించే స్థలం మాత్రమే కాదు, ఇస్లామీయ విద్యను నేర్చుకునే మరియు అల్లాహ్ ఆరాధన చేసే ముఖ్యమైన కేంద్రంగా కూడా ఉండేది.
అస్హాబ్ ఉస్-సుఫ్ఫా ఎవరు?
అస్హాబ్ ఉస్-సుఫ్ఫాలో ఉన్నవారు ఎక్కువగా పేదవారే. వారిలో చాలామందికి ఇల్లు లేదా కుటుంబం ఉండేది కాదు. అయితే కొందరు తమ ఇష్టంతోనే అక్కడ ఉండేవారు. ఎందుకంటే వారు ప్రవక్త ﷺకు దగ్గరగా ఉండి, ఆయన యొక్క బోధనలను నేర్చుకోవాలని మరియు ఎక్కువ సమయం అల్లాహ్ ఆరాధనలో గడపాలని కోరుకున్నారు.
ప్రవక్త ముహమ్మద్ ﷺ వారికి ఎంతో ప్రేమ చూపించేవారు.అంతేగాకుండా ప్రవక్త దగ్గరకు ఆహారం లేదా బహుమతులు వచ్చినప్పుడు ముందుగా అస్హాబ్ ఉస్-సుఫ్ఫాతో పంచుకునేవారు. మదీనాలోని అన్సార్ సహాబాలు కూడా తమకు చేతనైనంత సహాయం చేసేవారు.
ఒక సమయంలో సుమారు డెబ్బై మంది అక్కడ శాశ్వతంగా ఉండేవారు. మొత్తం మీద వివిధ కాలాల్లో దాదాపు మూడు వందల మంది ఈ సుఫ్ఫాలో నివసించారు.
అంతేగాకుండా అస్హాబ్ ఉస్-సుఫ్ఫా చాలా కష్టమైన జీవితాన్ని గడిపారు. వారు నివసించిన ప్రదేశం తెరిచి ఉండడం వల్ల ఎండ, చలి మరియు వర్షాన్ని భరించాల్సి వచ్చేది. అంతేగాకుండా వారికి సరిపడా బట్టలు కూడా ఉండేవి కాదు.
చాలా రోజుల పాటు తినడానికి ఆహారం కూడా దొరకని పరిస్థితులు ఉండేవి. కొన్నిసార్లు కొన్ని ఖర్జూర పండ్లతోనే రోజులు గడిపేవారు. మరియు అల్లాగే సహాబీ అబూ హురైరా (ర.అ) ఆకలి ఎక్కువగా ఉన్నప్పుడు తన కడుపుకు రాయి కట్టుకునేవాడినని చెప్పారు.
ఇంతటి కష్టాలు ఉన్నప్పటికీ వారు నమాజ్, అల్లాహ్ ఆరాధన మరియు అల్లాహ్ పై విశ్వాసాన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు.
జ్ఞానం పట్ల వారి ప్రేమ
అస్హాబ్ ఉస్-సుఫ్ఫా ఎక్కువ సమయం ఖుర్‌ఆన్ నేర్చుకోవడంలో మరియు ప్రవక్త ﷺ యొక్క బోధనలను వినడంలో గడిపేవారు. వారిలో చాలా మంది గొప్ప ఇస్లామీయ పండితులుగా ఎదిగారు.
మరియు వారిలో ప్రసిద్ధ సహాబీ అబూ హురైరా (ర.అ). ఆయన ప్రవక్త ﷺతో ఎక్కువ సమయం గడిపిన కారణంగా 5,000 కంటే ఎక్కువ హదీసులను జ్ఞాపకం ఉంచి తరువాతి తరాలకు అందించారు. అలాగే బిలాల్ ఇబ్ను రబాహ్ (ర.అ), సల్మాన్ అల్-ఫార్సీ (ర.అ), అబ్దుల్లాహ్ ఇబ్ను మసూద్ (ర.అ) మరియు సాలిమ్ (ర.అ) వంటి గొప్ప సహాబాలు కూడా అస్హాబ్ ఉస్-సుఫ్ఫాతో సంబంధం కలిగి ఉన్నారు. వారి జ్ఞానం మరియు సేవ ఇస్లాం అభివృద్ధికి ఎంతో ఉపయోగపడింది.
అయితే అంతేగాకుండా అస్హాబ్ ఉస్-సుఫ్ఫా కేవలం జ్ఞానం నేర్చుకున్నవారే కాదు. అవసరమైనప్పుడు ఇస్లాం కోసం యుద్ధాల్లో కూడా పాల్గొన్నారు. పేదరికంలో ఉన్నప్పటికీ, సరైన ఆయుధాలు లేకపోయినా ధైర్యంగా ముందుకు వెళ్లారు. వారిలో చాలామంది ఇస్లాం కోసం తమ ప్రాణాలను అర్పించి షహీద్‌లయ్యారు.
వారి జీవితం అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ﷺ పట్ల ఉన్న నిజమైన ప్రేమకు గొప్ప ఉదాహరణగా మారింది.
అస్హాబ్ ఉస్-సుఫ్ఫాపై ప్రవక్త ﷺ యొక్క ప్రేమ
ప్రవక్త ముహమ్మద్ ﷺ అస్హాబ్ ఉస్-సుఫ్ఫాను ఎంతో ఎక్కువగా ప్రేమించేవారు. వారి అవసరాలను ఎప్పుడూ గమనించేవారు. తన దగ్గరకు వచ్చిన ఆహారం, దానధర్మం మరియు బహుమతులను వారికి పంచేవారు. అల్లాగే వారి యొక్క కష్టాలను తన కష్టాలుగా భావించి ఎల్లప్పుడూ వారికి సహాయం చేసేవారు. వారు ఇస్లాం కోసం చేసిన త్యాగాలను ప్రవక్త ﷺ ఎంతో ఎక్కువగా గౌరవించారు మరియు వారి సేవను ప్రశంసించారు.
ముగింపు
అస్హాబ్ ఉస్-సుఫ్ఫా జీవితం ప్రతి ముస్లింకు ఒక గొప్ప ఆదర్శం. వారు ధనవంతులు కాకపోయినా, అల్లాహ్‌పై విశ్వాసం, ప్రవక్త ﷺపై ప్రేమ మరియు ఇస్లామీయ జ్ఞానం వల్ల నిజమైన సంపదను పొందారు.
వారి కృషి వల్ల ఖుర్‌ఆన్ మరియు హదీసుల జ్ఞానం తరువాతి తరాలకు చేరింది. వారి జీవితం మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నెరుపుతోంది. నిజమైన విజయం ధనం లేదా ఆస్తిలో కాదు. అల్లాహ్‌పై బలమైన విశ్వాసం, మంచి నడవడి మరియు ప్రవక్త ముహమ్మద్ ﷺ పట్ల నిజమైన ప్రేమలోనే నిజమైన విజయం ఉంది.


