ఈ రబీ అవ్వల్లో ప్రవక్త గారి రాకతో 1500 సంవత్సరాలు పూర్తి కానున్నాయి

ప్రపంచం నలుమూలల్లో రబీ'అల్-అవ్వల్ నెల (1446-AH) మొదటి రోజు యొక్క చంద్రుడిని చూసిన తరువాత ముస్లిములు తమ చరిత్రలో జరిగిన ఒక ముఖ్యమైన సందర్భాన్ని జరుపుకుంటారు. ప్రవక్త ముహమ్మద్ ﷺ ఈ భూమిపై జన్మించిన తరువాత మొత్తం 1499 సంవత్సరాలు గడిచాయి. లూనార్ క్యాలెండర్ ప్రకారం, ఈ సంవత్సరం(1446) రబీ'అల్-అవ్వల్ 12వ తేదీన మన ప్రవక్త గారి 1500వ పుట్టినరోజు అయ్యింది.

ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రభావశీల వ్యక్తి అయిన ప్రవక్త ﷺ, ఆయన జీవితం మరియు ఉపదేశాలు 1500 సంవత్సరాల తర్వాత కూడా ప్రపంచ నలుమూలల్లో చర్చించబడుతున్నాయి. ఆయన గారి జీవితం, విధానాలపై కొత్త అధ్యయనాలు పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంవత్సరాల నుండి ఇప్పుటి వరకు ప్రచురించబడుతూ వస్తున్నాయి. ఆయన గురించే ప్రపంచంలో అత్యధికంగా రాయబడింది ఎందుకంటే వారి పేరు అన్ని అధ్యయనాలలో వస్తుంది. ప్రపంచంలో ఏదైనా పేరు అత్యధికంగా ఉంది అంటే అది ముహమ్మదే. ముహమ్మద్ అని ప్రపంచంలో సుమారునూట యాభై మిలియన్ల తమ పేరుగా మంది పెట్టుకున్నారు.

ఇస్లామీయ క్యాలెండరు ప్రకారం మూడవ నెల రబీ'అల్-అవ్వల్. ఈ నెల మన ప్రియ ప్రవక్త గారి జీవితం, స్వభావాలు, ప్రేమ మరియు గౌరవం గురించి ప్రత్యేక సందేశాన్ని కలిపిస్తుంది. ఆయన జన్మ, మరణం, మరియు హిజ్రా వంటి ముఖ్యమైన ఘటనలు ఈ నెలలోనే జరిగాయి.

చాలా మంది ముస్లిములు మిలాద్ అల్-నబీ జరుపుకునేందుకు మసీదులో చేరి ప్రవక్త మహమ్మద్ ﷺ యొక్క జీవితం మరియు ఉపదేశాల గురించి, ఖురాన్ మరియు హదీసులు చదువుతారు. ఈ  సమావేశాలలో ఇస్లామీయ పండితులు ఆయన గారి స్వభావం, ఆయన సందేశకుడిగా ఉన్న పాత్ర ఆయన నైతికత, దయ మరియు న్యాయం లాంటి విషయాల గురించి చర్చిస్తారు.

ఈ గొప్ప సందర్భాన్ని చాలా మంది ముస్లిములు దానం చేయడం మరియు సమాజ సేవల కోసం ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది ప్రవక్త యొక్క దయ, దాతృత్వం మరియు అసహాయులకు సహాయం చేయడం లాంటి సున్నతును పొందడం కోసం. వీటిలో పేదలకు డబ్బు ఇవ్వడం, ఆహారం, వస్త్రాలు మరియు అవసరమైన ఇతర వస్తువులను పంచడం వంటి మంచి పనులు జరుగుతాయి. 

చాలా దేశాల్లో మన ప్రవక్త గారి పుట్టిన రోజును జరుపుకునేందుకు ప్రజలు మసీదుల్లో మరియు ఇల్లళ్లో కళకళ్లాడే విధంగా అలంకరిస్తారు. రోడ్లను వెలుగులతో బ్యానర్లు అలంకరించడం లాంటి సంబరాలు కూడా జరుగుతాయి. ఈ అలంకరణలలో సాధారణంగా ధార్మిక చిహ్నాలు, అరబిక్ లిపి, మరియు ఖురాన్ నుండి శ్లోకాలు కలిగి ఉంటాయి. ప్రతి చోట ఉత్సవాత్మక వాతావరణం ఉంటుంది. ప్రజా భవనాలు ఈ సందర్భాన్ని జరుపుకునేందుకు ప్రకాశవంతంతో నిండి ఉంటాయి.

మిలాద్ అల్-నబీను ప్రజలు భోజనాలు మరియు విందులతో కూడా జరుపుకుంటారు. కుటుంబాలు మరియు సమాజాలు కూడి, ఈ సందర్భాల్లో ప్రత్యేకంగా తయారు చేసిన ఆహారాలను పంచుకుంటారు. 

చాలా చోట్ల ప్రవక్త యొక్క ఉపదేశాలను చాలా బాగా అర్థం చేసుకోవడానికి విద్యా కార్యక్రమాలు, సెమినార్లు మరియు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. ఈ కార్యక్రమాల్లో ప్రవక్త యొక్క జీవితంలోని ప్రాముఖ్యత మరియు ఈ రోజుల్లో వాటి సంబంధం గురించి పండితుల చర్చలు ఉంటాయి. పిల్లలకు యువతకు ప్రవక్త యొక్క జీవితాన్ని మరియు ఇస్లామిక విలువలను నేర్పేందుకు వర్క్‌షాపులు కూడా నిర్వహిస్తారు. ఈ సందర్భంలో ఖురాన్ పఠనం, కవిత్వం మరియు వ్యాసం రాయడం వంటి పోటీలు కూడా నిర్వహిస్తారు.

కొంత మంది పండితులు ప్రత్యేకంగా సలఫీ మరియు వహాబీ సంప్రదాయాల్లో, ప్రవక్త యొక్క పుట్టినరోజు సంబరాలను ఒక కొత్త ఆవిష్కరణ (బిద’హా)గా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది ప్రవక్త గారి తరువాత ఎవ్వరూ ఆ సంవత్సరాల్లో జరుపుకోలేదు. ప్రవక్తను ప్రేమించటం మరియు గౌరవించటం ఎల్లప్పుడూ ఉన్నప్పుడు అది ప్రతి మనిషికి ముఖ్యమైన కుడా ఆయన పుట్టినరోజు కోసం కొత్త ధార్మిక ఆచరణలను సృష్టించడం అనుమతించబడదు అని వారు అంటారు. అయితే, సున్నీ పండితులు ఎక్కువగా, సంబరాలు విద్య, ఆలోచన, ఆరాధన మరియు ఇతర అనుమతించబడిన మంచి పనులను మంచి పనులగా భావిస్తారు. ఒక్క మాటలో ఈ రోజునూ మనం జరుపుకునే విధానం పై ఆరాధపడి ఉంటుంబడి ఉంది. ఎందుకంటే కొంత మంది ప్రవక్త గారి పుట్టిన రోజున కేకు కట్ చేయడం లాంటి చట్ట విరుద్ధ పనులు చేస్తారు. 

 

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter